Thursday, June 11, 2009
నాలో..సు'మధుర'స భావాలు...
నీ కులుకులు-సెలయేటి పరవళ్ళు...
నీ వగలు-వెండి వెలుగుల్లు..
నీ నవ్వులు-పువ్వుల వర్షాలు...
నీ సొగసులు-స్వర్ణసుమ సొభగుల్లు..
చెలరేపెను నాలో..సు'మధుర'స భావాలు...
నీ ఊహల్లో...
ఉదయించా సరికొత్తగ నేనే...
చూసాను-ఎన్నెన్నో వెన్నెల్లు-నీలో..
చూస్తున్నా-ఏవేవో ఉల్లాసాలు-నాలో...
ఈ శీతల సూర్యోదయాన..ఆ నీలి ఉదయాకాశాన...
నీ రూపురేఖలు సోధిస్తున్నా..నీ మెరుపులకై నిరీక్షిస్తున్నా...
నా హృదయ వేదన...
ఎండిన బీడులు..నా గుండెలు...
కురవని మేఘాలు..నా కళ్ళు...
వేసవి గాలులు..నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు...
శోక సాగరము..నా మనసు...
ఈ క్షణాన...నాకేది ఓదార్చే తోడు....
నా చెలికి ఒక లేఖ...
నా మదిని గిలిగింతలుపెడుతుంటే......
మనసైన చోట,మదిలోని మాట-నిస్సంకోచంగా చెప్పాలని...
నీ చెంతకు చేరి,నీ మనసుకు-మరీ మరీ చేరువవ్వాలని...
నీ మృధు స్పర్శతో,నా దేహం-పరవశమొందాలని...
నీ మది కారాగారంలో-చిరకాల బందీనవ్వాలని...
నా జీవితాంతం,నీ అనురాగాన్ని-పొందుతూ,అనుభవిస్తూ,ఆనందించాలని...
ఆశిస్తూ..ఆకాంక్షిస్తూ..అన్వేషిస్తూ..నిరీక్షిస్తూ..,
ఎన్నో ఆశలతో..మరెన్నో ఊహలతో..జీవిస్తూ...
నీ అన్వేషి....
నా మనసు-అంకితం
పదాలు ఎన్ని పేర్చితే,ఏం ప్రయోజనం...
నీ సౌందర్యం,నాకందని భావాల మధుర మనోహర దృశ్యకావ్యం...
నీ కదిలే ముంగురులు నా కథలకు ఆలంబనం...
ఏ నిఘంటువుల్లోనూ,నీ గురించి వ్రాసి ఉండదు...
గులాబీ రేకుల పై,సీతాకోకచిలుక రంగులలోనూ,నీ గురించి వ్రాసి ఉంటుంది...
నీ మౌన సంభాషణ,శీతల ఉదయాన సూర్యకిరణం...
నీ బెదిరే చూపులు,ప్రేమగీతాల పల్లవులు...
జలపాతాల హొరులో కదిలే స్వప్నపు దీపికవు నీవు...
ఎన్నెన్ని పుటలు నీ ఊహల విరి తోటలు...
నా స్వప్న సుందరీ...
నీకు అంకితం ఇవ్వాలంటే ఏముంది,నా వద్ద...?
గుప్పెడు మనసు తప్ప...!
'నా ప్రేమ'కు 'సాక్ష్యం'......
'నా' కంటిలో కదిలేటి 'నీ' కులుకులే...
'నా' వయసును వలచేటి 'నీ' వలపులే...
'నీ' చూపుకు అదిరేటి 'నా' గుండెలే...
'నీ' దర్శనంతో మెరిసేటి 'నా' కన్నులే...
'నా ప్రేమ'కు 'సాక్ష్యం'......
మానవుడే..మహనీయుడు,మహానీచుడు...
నా హృదయపూర్వక వినయాంజలి..
"మానవుడే..మహా నీచుడు..." అనిపించినట్టి మ(మృ)గమహారాజులకు
నా వేనవేల వేడుకోలు..
అట్టి 'మహా నీచులచే' వంచింపబడినట్టి రాధలకూ,శ్రీ లక్ష్ములకూ,స్వప్నికలకూ
నా అశ్రువుల వీడుకోలు..
అట్టి 'మహా నీచులకు' రాచమర్యాదలొనర్చుతున్నట్టి చట్టాలకూ,సమాజానికీ
నా కృతఙ్ఞతల క్రోదాంజలి...
నరరూప వా'నరులు'
అతివలకన్న యేమున్నది మిన్న-భువియందు..;
అట్టి వనితను వలచి,మోహించి,వంచించు..,
నరులకన్న వా'నరులు' మిన్న......
నా చెలి-ప్రకృతి
గలగలల గొదారి కన్నా..నా సఖి గలగలల చిరునవ్వే మిన్న...
స్వర్ణ వర్ణ చిరు మీనముల కన్నా..నా చెలి కలువరేకుల కనులే మిన్న...
అంబరాన మెరిసే తారల కన్నా..నా సఖి స్వర్ణ వజ్రఖజిత బేసరి మిన్న...
విరి తేనెల మెరుపు కన్నా..నా చెలి కెంపుల చెంపలు మిన్న...
నా స్వప్న సుందరి గూర్చి ఇంకా ఎన్నో చెప్పాలని ఉన్నా..సిగ్గేసి చెప్పలేకపొతున్నా...
నా కలల ప్రియ ఎక్కదుందోనని అనునిత్యం అన్వేషిస్తున్నా..ఆమె ప్రేమ కోసం నిరీక్షిస్తున్నా...
'ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక..నాలో ఉక్కిరిబిక్కిరి ఊహలు రేపే గోపికా...'
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక..
కవితలు చెప్పే హృదయం వుంది...
ప్రేమించే మనసు వుంది...
మనసులోన ఊహ వుంది...
ఊహల లోకం లో ఒక ఆశ వుంది...
కలసి వుండే కోమలి యెక్కడ ఉందో ???
చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా......