నను చేరగ నీవొస్తే..దిక్కులనే ఎదిరించన...?
మనసారా ప్రేమిస్తే..చుక్కలనే ఇల దించన...?
సఖుడయ్యే వరమిస్తే..దివి దాకా తోడుండన...?
నీ అడుగుల సవ్వడినై..,
నీ నవ్వుల గలగలనై..,
నీ నగవుల కధకళినై..,
నీతోనే నేనుంటా....
నీ కాలికి మెట్టెనై..,
నీ అందెల మువ్వనై..,
నీ ముక్కెర మెరుపునై..,
కలకాలం తోడుంటా....
నీ పలుకుల యతి నేనై..,
నీ ఊపిరి లయ నేనై..,
నీ గుండెల శృతి నేనై..,
నీ జతలో జీవిస్తా....
Thursday, June 24, 2010
Sunday, May 9, 2010
నా 'భాగ్య రేఖ'...
చిరు నవ్వులు చిందిస్తూ,నాలో కలకలం రేపావు..
చిరు నగవులు ఒలికిస్తూ,నా 'కవికలం' నడిపావు..
నీ తలపుల సంకెలలో బంధీనై పడి ఉన్నా..
నిండు పున్నమి పండు వెన్నెలలో నీ మెరుపులు చూస్తున్నా..
నిశిరాతిరి చీకటి తెరలను చేధించే 'శశి రేఖ'వు నీవు...
నా పగటి కలలను పండించే 'భాగ్య రేఖ'వు కాలెవా-నీవు...
Saturday, May 8, 2010
వనితా వసంతం...
వన్నెచిన్నెల వలపు వెండి వెన్నెలై వెల్లువెత్తి..
వయసు వాకిట అడుగుపెట్టిన పట్టు పరికిణిలో..
వాలుకనుల విల్లెత్తి ఓర చూపుల బాణమేసింది..
నా మనసైన,వరసైన వయ్యారి వనితా వసంతం...
హరివిల్లు'-ఆమె'...
కురిసి వెలిసిన వానలో విరిసిన 'హరివిల్లు'-ఆమె...
చూసిన కనులకు కునుకుండదు..!
వలచిన వయసు కుదురుండదు..!!
ఆమె కాంతులలో మురిసిన మనసు..
ఉప్పెనై ఉవ్వెత్తున ఉరకలేసెను.,
మయూరమై మైమరపున నాట్యమాడెను..,
మధుర భావాలను-భాషగా మార్చి,అక్షరాలు కూర్చి,పదాలు పేర్చి-కవితలు రాసేను..నా లాగ...
అపురూపమైన 'ఆమె'...
ఈ అనంత సృష్టిలో అత్యంత అపురూపమైనవి మూడు...
'జాబిలై' వెలిగే-ఆమె మోము..
'తారలై' మెరిసే-ఆమె కళ్ళు..
'వెన్నెలై' కురిసే-ఆమె నవ్వు..
మొత్తంగా..గుత్తంగా..'హరివిల్లై' విరిసే-ఆమె...
ప్రేమ 'జాబిలి'...
భువియందు నేనొక ప్రేమ బాటసారి..!
దివియందు నీవొక ప్రేమ జాబిలి..!!
నీ నవ్వుల వెన్నెల్లు నాపై కురిపించి-నా మదిలో అలజడి రేపావు..!
కానీ,నా జీవితపయనంలో లేని 'ప్రేమ' మజిలీ కోసం ఎన్నాళ్ళని వెతకను..!!
అంబరాన అలరారే అందమైన 'జాబిలి'ని చేరుకోలేను...!
నీవు నా గుండెలో చేసిన తీపి గాయాల గురుతులను చెరుపుకోలేను...!!
అందుకే,ఆ 'జాబిలి'ని చూస్తూ..
నిన్ను ఆరాధిస్తూ..అభిమానిస్తూ..
నే ఉంటా..జీవితాంతం...!!!
Subscribe to:
Posts (Atom)