దేవుడే-నిను గని..ఈర్ష్య చెందేనా...
మృత్యువే-వరుణుడై..నిన్ను మింగేనా...
తెలుగు నేలను తడిపినావురా...
హరిత వర్ణము చేసినావురా...
ప్రజలలో..మనిషివై..వెలిగేవురా...
ఆ రైతుకే..బంధువై..మెలిగేవురా...
మరచిపోలేము-నీ నవ్వులే...
ఆరిపోయేను-మా దివ్వెలే...
నీ నవ్వుకై-రాష్ట్రమే..ఎదురు చూసిందే...
నీ మరణమే-నిజమనీ..బెదిరిపోఇందే...
ఆడపడుచుల 'అన్న' నీవురా...
అన్నదమ్ముల 'అండ' నీవురా...
నిరుపేదకే..అన్నమై..దొరికేవురా...
మా గుండెలో..దేవుడై..నిలిచేవురా...
అలసిపోయేను-మా చూపులే...
కరిగిపోయేను-మా కన్నులే...
పచ్చని-పల్లెలే..బోసిపోయాయే...
చల్లని-నవ్వులే..మాకు కరువాయే...
వాడవాడల శోక సంద్రములే...
తెలుగు కన్నుల నెత్తుటి బిందువులే...
నీ నవ్వుతో..మనసులే..దోచావురా...
నీ పిలుపుతో..మమతలే..గెలిచేవురా...
సొలసిపోయేను..మా మనసులే...
అవిసిపోయేను..మా గుండెలే...
యువతరం-నినుగని..మెరిసిపోయిందే...
మా 'అన్న'వే-నీవని..వెంట నడిచిందే...
ఉచిత విద్యను మాకు అందించీ...
ఊరు ఊరున ఇళ్ళు కట్టించీ...
ప్రతి ఇంటిలో..బంధమై..తిరిగేవురా...
మా కంటిలో..వెలుగువై..మెరిసేవురా...
కానెకాలేదు-నీశ్రమ వృధా...
మాకు మిగిలేను-తీరని వ్యాధ...
Wednesday, September 9, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment